సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ పై భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. పోలీసులు చెప్పినా పట్టించు కోలేదని గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారని మండిపడ్డారు. సీఎంగా పని చేసిన వ్యక్తికి కోడ్ ఉందనే విషయం తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసీ రూల్స్ పాటించకుండా మరో వైపు భద్రత కల్పించాలని కోరడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు వివిధ వేదికలు ఉన్నాయని అన్నారు.