డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో తాము సమన్వయంతోనే ముందుకు వెళుతున్నామని చెప్పారు. వెన్ను నొప్పి కారణంగానే తాను సమావేశాలకు హాజరు కాలేక పోయానని తెలిపారు. ఇప్పటికీ నొప్పితో బాధ పడుతున్నానని వాపోయారు. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చే పనిలో ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. నిబద్దతతో తన శాఖలను నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు.