రాజలింగం హత్యపై సీఎం సీరియస్
NEWS Feb 20,2025 11:34 am
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని, దీనికి కారణం కేసీఆర్, హరీశ్ రావు అంటూ కోర్టులో కేసు వేసిన భూపాలపల్లి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త రాజలింగం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీబీసీఐడీ తో విచారణకు ఆదేశించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా గతంలో రాజలింగం బీఆర్ఎస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డి భూ కబ్జా భాగోతంపై సంచలన ఆరోపణలు చేశారు.