మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోష్యం చెప్పారు. తమ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన 11 మంది ఎమ్మెల్యేలపై కేసు నడుస్తోందని, వారిపై అనర్హత వేటు పడడం తప్పదన్నారు. రాబోయే ప్రభుత్వం తమదేనని ప్రకటించారు. పాతికేళ్ల స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదుకు హరీశ్ ను ఇంఛార్జిగా నియమించామన్నారు. త్వరలోనే మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.