కాంగ్రెస్ పార్టీ నేతలు హిందువులేనా..?
NEWS Feb 20,2025 08:33 am
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై భగ్గుమన్నారు. వాళ్లు అసలు హిందువులేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. వారిలో ప్రవహిస్తున్నది హిందూ రక్తం కాదని..ముస్లింల రక్తం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్కార్ ముస్లింలకు రంజాన్ సందర్బంగా వెసులుబాటు కల్పిస్తోందని, కానీ అయ్యప్ప మాల, శివ మాల, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులకు ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.