తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS Feb 20,2025 08:15 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తు బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 72 వేల 745 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 156 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.48 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 14 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.