ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనే దానిపై సస్పెన్స్ వీడింది. బీజేపీ హైకమాండ్ ఆఖరు నిమిషంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రేఖా గుప్తను శాసన సభా పక్షం సమావేశమై సీఎంగా ఎన్నుకున్నారు. ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 48 సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఆప్ 22 సీట్లకే పరిమితం కాగా కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టలేదు. పర్వేశ్ వర్మ చివరి వరకు సీఎం రేసులు ఉన్నారు. కానీ ఎందుకనో తనను తప్పించారు.