మూడేండ్లలో రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి
NEWS Feb 19,2025 09:57 pm
నిజామాబాద్, ముద్కేడ్ రైల్వే స్టేషన్లతో పాటు పలు అభివృద్ధి పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లతో పాటు ప్రయాణికుల విశ్రాంతి గదులు, రైల్వే సిగ్నల్ కంట్రోల్ రూమ్ ను ఆయన పరిశీలించారు.డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయని, మరో మూడేండ్లలో పనులు పూర్తి అవుతాయని వెల్లడించారు. రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను, సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేందుకు రైల్వే శాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు