కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించిన కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఇప్పటి వరకు ఎందుకు స్పందించ లేదంటూ మోడీ కేంద్ర సర్కార్ ను నిలదీసింది. ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. రాహుల్ గాంధీ భారత దేశానికి చెందిన వ్యక్తి కాదని, తను బ్రిటీష్ పౌరుడని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి. ఆయన దాఖలు చేసిన కేసుపై స్పందించింది కోర్టు. వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేసింది.