బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని అన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను రాష్ట్ర మంతటా ఘణంగా చేపట్టాలని స్పష్టం చేశారు. పార్టీ కమిటీలను వేస్తామన్నారు. కమిటీలకు ఇంఛార్జిగా హరీశ్ రావును నియమిస్తున్నట్లు వెల్లడించారు కేసీఆర్. అంతే కాకుండా మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. వారికి 53 సీట్లు ఇస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ నిర్వహించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.