శ్రీవారి సన్నిధిలో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బూతు పురాణం కలకలం రేపింది. తిరుమలకు లక్షలాది మంది దర్శనం కోసం తరలి వస్తారు. ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన సభ్యుడు భక్తుల ముందే ఉద్యోగిపై చిందులు వేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.