రాష్ట్రంలో అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని అన్నారు ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ. ఏకసభ్య కమిషన్ చైర్మన్ ను కలిసాశామన్నారు. వర్గీకరణ పై షమీమ్ అక్తర్ రిపోర్ట్ సరిగా చూడకుండా క్యాబినెట్ ఆమోదించిందని అన్నారు. పూర్తి చర్చ జరగకుండా ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసిందన్నారు. కమిషన్ రిపోర్టు లో లోపాలు సరి చేయాలని సీఎం కు కూడా సూచించామన్నారు. తాము చెప్పిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారని, అందుకే కమిషన్ గడువు పెంచారని చెప్పారు.