జగన్ పై భగ్గుమన్న అచ్చెన్న
NEWS Feb 19,2025 04:46 pm
మంత్రి అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయనకు ఏం అర్హత ఉందని మిర్చి రైతుల గురించి మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. తన ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని, ఇప్పుడు చిలుక పలుకులు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను ఆగమాగం చేసిన ఘనత నీదేనంటూ ఎద్దేవా చేశారు. మిర్చి రైతులను ఆదుకుంటామని , కేంద్రంతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు.