అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్
NEWS Feb 19,2025 02:31 pm
మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగ మిట్టపల్లి లక్ష్మణ్ ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు మెట్పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి. నిందితుడి నుండి 103 గ్రాముల బంగారు ఆభరణాలు, 125.3 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దొంగను మల్లాపూర్ ఎస్ఐ కె. రాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారని తెలిపారు.