మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు బిగ్ షాక్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నంబర్ రైలును రద్దు చేసింది. ఈ రైలు అలహాబాద్ కు వెళుతుంది. దీంతో అక్కడికి వెళ్లాలని అనుకున్న 1500 మంది భక్తులకు షాక్ తగిలింది. మంగళవారం రాత్రి 11.45 నిమిషాలకు ముందుగా బుక్ చేసుకున్న వారికి మెస్సేజ్ లు పంపించింది. అంతే కాకుండా ఈనెల 21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు రావాల్సిన 12792 నంబరు రైలునూ ఆపరేషనల్ కారణంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.