కేరళ లోని మలప్పురం ఫుట్ బాల్ మైదానంలో బాణా సంచా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. మ్యాచ్ కు ముందు బాణా సంచా పేలడంతో చూసేందుకు వచ్చిన అభిమానులు భయంతో పరుగులు తీశారు. తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.