తిరుమల భక్తులతో కిట కిట
NEWS Feb 19,2025 08:19 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 68 వేల 427 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 66 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు 14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.