ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామ శివారులో గత డిసెంబర్ లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వివిధ ఆలయాల్లో చోరీకి పాల్పడిన రేకుర్తికి చెందిన తూర్పాటి కనకయ్య (32)ను అరెస్ట్ చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తెలిపారు. ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని పట్టుకొని విచారణ చేయగా గుడిలలో దొంగ తనం చేసినట్టు ఒప్పుకోగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.