సైబర్ సెక్యూరిటీపై ఫోకస్
NEWS Feb 18,2025 09:40 pm
సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ 2025 (షీల్డ్)ను ప్రారంభించారు. పోలీస్, ఐటీ నిపుణులతో కూడిన సేవలను వినియోగించు కుంటామని చెప్పారు. సైబర్ క్రైం దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాల్ గా మారిందన్నారు. గత ఏడాది దేశ వ్యాప్తంగా రూ. 22,812 కోట్లు దోచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.