ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చేసిన డిమాండ్ కు తల వంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ మీద అభ్యంతరాలను పరిశీలించేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. మరో నెల రోజుల పాటు మార్చి 10 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. మందకృష్ణ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.