బాండు మొక్కజొన్న కంపెనీపై చర్యలకు వినతి
NEWS Feb 18,2025 08:07 pm
వెంకటాపురం మండల తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్లకు మంగళవారం బీజేపీ మండల నాయకులతో కలిసి పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట సతీష్ వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక దిగుబడి పేరుతో రైతులను మోసం బాండు మొక్కజొన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.