వంశీని రెచ్చగొట్టిన పట్టాభి
NEWS Feb 18,2025 03:54 pm
మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశాడు. జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. తనకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. వంశీని కావాలని పట్టాభి నీచంగా మాట్లాడాలని, ఇలా ప్రోత్సహించేలా చేసింది చంద్రబాబు అంటూ ఆరోపించారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లనే వంశీ సీరియస్ అయ్యాడని అన్నారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. పట్టాభి, అనుచరులు కలిసి ఎస్సీ నేతపై దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో ఎస్ఐ తలకు కూడా గాయమైందన్నారు.