ప్రజలను రక్షించాల్సిన సీఐ పక్కదారి పట్టిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు మక్తల్ సీఐ చంద్రశేఖర్. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సీఐతో పాటు కానిస్టేబుళ్లు శివా రెడ్డి, నరసింహ కూడా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు