ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
NEWS Feb 18,2025 02:50 pm
ములుగు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము గెలిస్తే అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల పింఛన్ సమస్యలు, సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.