హైడ్రా కమిషనర్ సంచలన ప్రకటన చేశారు. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని సూచించారు. నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని ,వీటిని కొన్న వారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేదం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మిగూడ విలేజ్ సర్వే నంబరు 50 లోని 1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.