మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్ పదవీ కాలం పూర్తి కావడంతో జ్ఞానేష్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చింది. విపక్షాలతో సంప్రదించకుండా ఎలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారని నిప్పులు చెరిగారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.