శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బ్లూ డార్ట్ కార్గో విమానానికి ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ కు ఈ ఫ్లైట్ వచ్చింది. కాగా దిగే సమయంలో గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వే పై అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాలని పైలట్ కోరాడు. పరిస్థితి గమనించిన ఎయిర్ పోర్ట్ అధికారులు అంతర్జాతీయ విమానాలను అన్నింటిని ఆపేశారు. సేఫ్ గా కార్గో ఫ్లైట్ ను ల్యాండింగ్ అయ్యేలా చేశారు. కాగా ల్యాండింగ్ సమయంలో విమానంలో 5 మంది సిబ్బంది ఉన్నారు.