కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావించే తిరుమలకు పెద్ద ఎత్తున కానుకలు, విరాళాలు ప్రతి రోజూ అందుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైకి చెందిన భక్తుడు తుషార్ కుమార్ టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు ఏకంగా రూ. 11 కోట్లు భారీ విరాళాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్బంగా భక్తుల ఆకలిని తీరుస్తున్న అన్న ప్రసాదానికి భారీ విరాళాన్ని అందజేసిన భక్తుడిని ప్రత్యేకంగా అభినందించారు ఏఈవో.