నవీ ముంబైలోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయం బాంద్రాలో టిటిడి సమాచార కేంద్రం నిర్మాణానికి భూమిని కోరుతూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ ఆలయ సదస్సు సందర్భంగా స్థలం కేటాయింపు కోరుతూ ఒక అభ్యర్థన లేఖను అందజేశారు.