జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న పురాతన పోచమ్మ ఆలయాన్ని బస్టాండ్ విస్తరణ పనులలో తొలగించవద్దని ములుగు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోచమ్మ ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కొలుస్తున్న ఆలయాన్ని మోడల్ బస్టాండ్ కోసం తొలగించాలను కోవడం సరైంది కాదని అన్నారు. ఆలయాన్ని ఇక్కడి నుంచి తరలించాలని చూస్తే ప్రజా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు.