కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై భగ్గుమన్నారు టీపీసీసీ నేత అద్దంకి దయాకర్. ఆ ఇద్దరూ రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొత్తగా డ్రామాలు ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మీకు రాహుల్ గాంధీ కులం ఏమిటో తెలియక పోతే ఎలా అని ప్రశ్నించారు. దీన్ని బట్టి మీ దివాళాకోరుతనం ఏమిటో అర్థం అవుతుందన్నారు.