సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు తిరిగి దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు రేవంత్ రెడ్డి.