టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పదవి బీసీకి దక్కుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా తాను ఆఖరి రెడి సీఎం అవుతానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు రేంత్ రెడ్డి. ఈ తరుణంలో టీపీపీసీసీ బాస్ సీఎం పోస్టు పై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.