కామారెడ్డి: కేసీఆర్ హాయంలోనే తెలంగాణ లో అభివృద్ధి పనులు జరిగాయని అయిన పేరు చరిత్రలో సువర్ణక్షరాలతో నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే గంపగోవర్దన్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్బంగా జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా గంపగోవర్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాటల ప్రభుత్వం కొనసాగుతుందని, కల్లబొల్లి మాటలతో అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారన్నారు. పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి భాను ప్రసాద్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు