ఢిల్లీలో భూకంపంపై మోడీ స్పందన
NEWS Feb 17,2025 05:49 am
ఉత్తరాది రాష్ట్రాలు ఢిల్లీ, బీహార్ లలో భూకంపం చోటు చేసుకుంది. పలు చోట్ల ఆస్తి నష్టం సంభవించింది. హస్తినలోని నోయిడా, తదితర నగరాలలో ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్లను వదిలి బయటకు వచ్చారు. బీహార్ లో రిక్టర్ స్కేల్ 4.0 గా నమోదైంది. ఈ సందర్బంగా స్పందించారు ప్రధాని మోడీ. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. పరిస్థితిపై సంబంధిత అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగ లేదన్నారు.