వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే విజయ సాయి రెడ్డి రాజీనామా చేయగా ఆయన బాటలోనే మరో నేత పార్టీని వీడనున్నారు. మాజీ ఎంపీ కేశినేని నాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో తన అనుచరులతో కలిసి ఆంతరంగిక చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలోనే నాని చేరే విషయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గతంలో తను టీడీపీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో చేరారు.