ఉత్తరాది రాష్ట్రాలలో వరుసగా భూమి కంపించింది. బీహార్ లో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.0 గా నమోదైంది. శివాన్ దగ్గర భూకంప కేంద్రం గుర్తించింది. ప్రకంపనలు చోటు చేసుకోవడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం సోమవారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నోయిడా, గురుగ్రామ్ లో భూమి కంపించింది. ఆస్తి నష్టం చోటు చేసుకుంది.