పెద్దగట్టు జాతరకు ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించిందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్టు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పెద్దగట్టు జాతరకు వస్తారని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి దేవాలయాల అభివృద్దికి ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. తెలంగాణలో జరిగే జాతరలలో పెద్దగట్టు జాతరకు ప్రత్యేకత ఉందన్నారు.