ఢిల్లీ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్. పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కొలువు తీరాక రైల్వే శాఖను భ్రష్టు పట్టించారని, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.