వల్లభనేని వంశీ కేసు విచారణ ముమ్మరం
NEWS Feb 17,2025 04:49 am
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణను ముమ్మరం చేశారు ఏపీ పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు హైదరాబాద్, విశాఖకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. ఫోన్ కాల్స్ పై ఫోకస్ పెట్టారు. నిందితులు రెండు కార్లను ఉపయోగించారని, టోల్ గేట్ల వద్ద కార్లను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్నారు.