ప్రసిద్ద క్షేత్రం యాదగిరిగుట్టలో మహా కుంభ సంప్రోక్షణ జరగనుంది. ఈనెల 23 వరకు మహాక్రతువు నిర్వహించనున్నారు. ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం పనులు పూర్తయ్యాయి. 108 మంది రుత్వికులతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలు తీసుకు వచ్చారు. కొండపైన ఐదు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీలక్ష్మీ హవన హోమాలు నిర్వహిస్తాయి. విమాన రాజ గోపురానికి 25 కలశాలతో అభిషేకం చేస్తారు.