శ్రీశైలం పోటెత్తిన భక్తజనం
NEWS Feb 17,2025 04:39 am
శైవ భక్తుల ఆరాధ్య దైవం శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శివ రాత్రి దగ్గర పడుతుండడంతో శివ దీక్షలు చేపట్టిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కొందరు కాలి నడకన మల్లన్న దర్శనం కోసం వస్తుంటే మరికొందరు వాహనాల ద్వారా వస్తున్నారు. సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపి వేసినట్లు ఈవో వెల్లడించారు. స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం 5 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.