ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మంగళగిరిలోని సచివాలయంలో భేటీ అయ్యారు. పవన్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా సినిమా రంగానికి సంబంధించి కీలక అంశాల గురించి చర్చించారు రాజేంద్ర ప్రసాద్. ఇటీవల తన ఒక్కగానొక్క కూతురు అకారణంగా మృతి చెందింది. తెలుగు చలన చిత్ర రంగానికి తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు పవర్ స్టార్.