సత్తా ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం
NEWS Feb 16,2025 03:35 pm
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనేనని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమను చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. సత్తా ఉంది కాబట్టే ఎన్నికల బరిలో నిలిచామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు, అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ మోసం చేసిందని, బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు.