దీపా దాస్ మున్షీ గ్రేట్ లీడర్
NEWS Feb 16,2025 03:35 pm
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ ఏఐసీసీ ఇంఛార్జ్ గా ఉంటూ తెలంగాణలో ఏడాది పాటు అదనపు బాధ్యతలు అద్భుతంగా పని చేశారంటూ కితాబు ఇచ్చారు. ఆమె నిబద్దత, క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకురాలన్నారు. కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు కావాలని దీపా దాస్ మున్షీపై దుష్ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రానికి సంబంధించి కొత్తగా బాధ్యతలు చేపట్టేందుకు ఆమెను మార్చారని తెలిపారు. ఆమెపై నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు.