టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. గాంధీల కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత ఆయనకు ఎక్కడుందని ప్రశ్నించారు. గాంధీల కుటుంబం కుల మతాలకు అతీతమని స్పష్టం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం భర్తది ఏ కులమైతే..భార్యది కూడా అదే కులం అవుతుందన్నారు. హిందూ ధర్మంపై రాజకీయం చేసే ఓట్లు అడిగి బతికే బండి సంజయ్ కి ఇది కూడా తెలియక పోతే ఎలా అని ఎద్దేవా చేశారు.