రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆదివారం 10 వేలకు పైగా జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు క్యూ కడుతున్నారు. అన్ని ఫంక్షన్ హాల్స్ కళ కళ లాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిండి పోయాయి. బస్సులు ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. ప్రైవేట్ బస్సులు, వాహనాలు సైతం పెళ్లి వేడుకలకు వెళ్లేందుకు నిండి పోయాయి. హైవేలపై వందలాది వాహనాలు నిలిచి పోయాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. నగర శివారు ప్రాంతాల్లో ప్రయాణీకులతో క్రిక్కరిసి పోయాయి బస్సు స్టాపులు.