ఏపీని భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి
NEWS Feb 16,2025 04:34 am
తన ఐదేళ్ల పాలనా కాలంలో జగన్ ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. ప్రజలకు నరకం చూపించాడని, తమ పార్టీకి చెందిన నేతలు, శ్రేణులను ముప్పుతిప్పలు పెట్టాడన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ సక్రమేనని స్పష్టం చేశారు. టీచర్లకు బార్ లు, బాత్రూంల వద్ద డ్యూటీలు నిర్వహించేలా చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఏడు నెలల కాలంలో కూటమి సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుందన్నారు.