ప్రభుత్వ ప్రతిష్టను నిలబెట్టాలి
NEWS Feb 16,2025 03:22 am
ప్రజల నమ్మకాన్ని..ప్రభుత్వ ప్రతిష్ఠను నిలబెట్టాలని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. పోలీస్, న్యాయ వ్యవస్థల్లో మహిళా సాధికారత పెరుగుతోందన్నారు. పోలీస్, ప్రాసిక్యూటర్ల సమన్వయంతోనే సత్వర న్యాయం జరుగుతుందన్నారు. సర్వం కోల్పోయి మీ దగ్గరకి వచ్చిన వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉయ్యాలలో ఉన్న పసిపాపలపై అత్యాచారాలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు అనిత. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళనకరమన్నారు.