కిషన్ రెడ్డి కామెంట్స్ వీహెచ్ సీరియస్
NEWS Feb 15,2025 01:09 pm
రాహుల్ గాంధీది ఏ కులం అంటూ ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాజీ ఎంపీ వి. హనుమంత రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కులం బడుగు బలహీన వర్గాల కులమన్నారు. బహుజనుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అని, గాంధీ కుటుంబానికి మాత్రమే ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కుల గణన చేస్తారా లేదా అన్నది ముందు చెప్పాలన్నారు. సొల్లు కబుర్లు బంద్ చేస్తే బెటర్ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి క్షమాపణ చెబితే మంచిదన్నారు.